నందు ఇంట సెలబ్రేషన్స్‌ మొదలు.. సీమంతం వేడుక చూశారా? | Sakshi
Sakshi News home page

Geetha Madhuri: మరికొద్దిరోజుల్లో రెండో బిడ్డకు జన్మనివ్వనున్న సింగర్‌, ఘనంగా సీమంతం

Published Thu, Feb 1 2024 6:51 PM

Singer Geetha Madhuri Seemantham pics Viral - Sakshi

టాలీవుడ్‌ టాప్‌ సింగర్‌, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ గీతా మాధురి మాతృత్వపు మధురిమను మరోసారి అనుభవించేందుకు తహతహలాడుతోంది. నందు- గీతా దంపతులకు ఇదివరకే దాక్షాయని అనే కూతురు ఉంది. ఫిబ్రవరిలో దాక్షాయనికి తోడుగా ఓ బుజ్జాయి రానుంది. ఈ విషయాన్ని గత డిసెంబర్‌లో వెల్లడించింది గీతా మాధురి. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి.

(గీతా మాధురి సీమంతం వేడుక ఫోటోల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

తాజాగా ఆమెకు సీమంతం జరిగింది. కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక ఎంతో ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సీమంతం ఫంక్షన్‌లో గీతా.. ఆకుపచ్చ- నారింజ కాంబినేషన్‌లో ఉన్న చీరలో మెరిసిపోయింది. బ్యాగ్రౌండ్‌లో కూడా అంతా సహజంగా కనిపించేలా పూలతో డెకరేషన్‌ చేశారు.

చదవండి: స్టార్‌ కమెడియన్‌ సంపాదించిందెంత?
కొత్త ప్రియుడితో కలిసి మాజీ లవర్‌కు చుక్కలు చూపించిన నటి.. బ్రేకప్‌తో శని వదిలిందంటూ..

Advertisement
 
Advertisement