Shooter Movie: షూటర్‌ వస్తున్నాడు | Shooter Movie Release Date Out | Sakshi
Sakshi News home page

Shooter Movie: షూటర్‌ వస్తున్నాడు

Jun 5 2025 3:44 PM | Updated on Jun 5 2025 4:00 PM

Shooter Movie Release Date Out

రవిబాబు, సుమన్‌, రాశి, ఆమని, అన్నపూర్ణమ్మ, ఎస్తేర్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘షూటర్‌’. శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్‌ బ్యానర్‌పై ఎస్‌. శ్రీనివాసులు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల విడుదల కానుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ తెలుగు ఫిలిమ్ ఛాంబర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చిత్ర దర్శక నిర్మాత ఎస్. శ్రీనివాసులు మాట్లాడుతూ.. "సమాజలోని యదార్థ ఘటనల నేపథ్యంలో 'షూటర్'ని తెరకెక్కించాం. 

ఈ నెల 7న థియేటర్ లలో విడుదల చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ చూడదగిన సినిమా. "షూటర్"ను ఆదరించి హిట్ చేయాలని ప్రేక్షకులను కోరుతున్నాను' అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దామోదర ప్రసాద్, సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, 'ఘర్షణ' శ్రీనివాస్, తదితరులు పాల్గొని చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. "షూటర్" సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement