‘ఘోస్ట్’గా శివరాజ్‌ కుమార్‌.. ఫస్ట్‌లుక్‌ అదిరింది!

Shivarajkumar Ghost Movie First Look Poster Out - Sakshi

కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌ కుమార్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ఘోస్ట్‌’. హైయెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ‘బీర్బల్‌’ ఫేమ్‌ శ్రీని దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సందేశ్‌ నాగరాజ్‌ తన సందేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నేడు(జులై 12) శివరాజ్‌ కుమార్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా ‘ఘోస్ట్‌’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ విడుదల చేశారు.

గన్ పట్టుకుని తీక్షణంగా చూస్తున్న శివరాజ్ కుమార్ లుక్ అందరిని ఆకట్టుకుంటుంది.సెర్చ్ లైట్, బైకర్స్, కార్స్, గన్స్... వీటితో డిజైన్ చేసిన పోస్టర్ చూస్తే.. ఇది భారీ యాక్షన​్‌ చిత్రమని తెలిసిపోతుంది. ఈ చిత్రానికి టాప్‌ టెక్నీషియన్స్‌ పని చేస్తున్నారు.  తగరు, సలగ చిత్రాలకు మాటలందించిన మస్తీ, కన్నడ చిత్రాల్లో అత్యుత్తమ థ్రిల్లర్స్ లో ఒకటిగా చెప్పుకునే బీర్బల్ కి సంభాషణలు రాసిన ప్రసన్న వి ఎం 'ఘోస్ట్' కి డైలాగ్స్ రాస్తున్నారు. కేజీయఫ్‌తో దేశవ్యాప్తంగా  గుర్తింపు తెచ్చుకున్న ఆర్ట్ డైరెక్టర్ శివ కుమార్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు.ఆగస్ట్ చివరి వారంలో 'ఘోస్ట్' చిత్రీకరణ ప్రారంభం కానుందని చిత్ర యూనిట్‌ పేర్కొంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top