రెగ్యులర్‌ కథలు చేయను : శివ కంఠమనేని | Sakshi
Sakshi News home page

రెగ్యులర్‌ కథలు చేయను : శివ కంఠమనేని

Published Fri, Oct 13 2023 8:28 AM

Shiva Kantamaneni Talk About Madhurapudi Gramam Ane Nenu Movie - Sakshi

శివ కంఠమనేని, క్యాథలిన్‌ గౌడ జంటగా మల్లికార్జున్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఫిల్మ్‌ ‘మధురపూడి గ్రామం అనే నేను’. ముప్పా వెంకయ్య చౌదరి సారథ్యంలో జి.రాంబాబు యాదవ్‌ సమర్పణలో కేఎస్‌ శంకర్‌ రావు, ఆర్‌. వెంకటేశ్వర రావు నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శివ కంఠమనేని మాట్లాడుతూ– ‘‘ఒంగోలు బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్‌ డ్రామా ఈ చిత్రం. మొరటుగా ఉండే సూరి పాత్రలో కనిపిస్తాను.

తన మిత్రుడు బాబ్జీ ఎమ్మెల్యే కావడం కోసం సూరి ఏం చేస్తాడు? ఈ క్రమంలో అతని ప్రేమకథ ఏ విధంగా ప్రభావితమైంది? అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. కమర్షియల్‌ పంథాలోనే ఈ సినిమా కథనం సాగుతుంది. ప్రేమ అనేది శరీరానికి కాదు.. మనసులకు సంబంధించినదనే సందేశం అంతర్లీనంగా ఉంటుంది.

నేను రెగ్యులర్‌ కథలు చేయను. నేను చేసిన ‘అక్కడొకడుంటాడు’లో నా పోస్టర్స్‌ చూసి ‘మధురపూడి..’ సినిమా కథకు నన్ను ఎంపిక చేసుకున్నారు మల్లికార్జున్‌గారు. దాదాపు 150కిపైగా థియేటర్స్‌లో రిలీజ్‌ చేస్తున్నాం. నా తర్వాతి చిత్రాలు ‘మణిశంకర్, రాఘవరెడ్డి’ త్వరలో రిలీజ్‌ కానున్నాయి. మంచు లక్ష్మిగారి ‘ఆదిపర్వం’ చిత్రంలో పవర్‌ఫుల్‌ రోల్‌ చేస్తున్నాను’’ అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement