చమ్మక్‌ చంద్ర.. 'దేవదాసు పారు వల్లే బ్యాడు' సాంగ్‌ విన్నారా? | Shikaaru Movie: Devadasu Paaru Valla Lyrical Song Out Now | Sakshi
Sakshi News home page

Shikaaru Movie: తన సినిమాకు తనే పాట రాసిన డైరెక్టర్‌.. అదిరిపోయిందిగా!

Published Mon, Jun 13 2022 7:59 AM | Last Updated on Mon, Jun 13 2022 7:59 AM

Shikaaru Movie: Devadasu Paaru Valla Lyrical Song Out Now - Sakshi

సాయి ధన్సిక, తేజ్‌ కూరపాటి, అభినవ్‌ మేడిశెట్టి, కేవీ ధీరజ్, నవకాంత్, చమ్మక్‌ చంద్ర ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘షికారు’. ఈ చిత్రానికి హరి కొలగాని దర్శకుడు. నాగేశ్వరి (పద్మ) సమర్పణలో శ్రీసాయి లక్ష్మీ క్రియేషన్స్‌పై పి.ఎస్‌.ఆర్‌. కుమార్‌ (బాబ్జీ, వైజాగ్‌) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదలవుతోంది. శేఖర్‌ చంద్ర సంగీతం అందించారు.

హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రంలోని ‘దేవదాసు పారు వల్ల బ్యాడు.. మజ్ను లైఫ్‌ లైలా వల్లే సాడ్‌’ అనే పాటను విడుదల చేశారు. హరి కొలగాని మాట్లాడుతూ– ‘‘ఎంటర్‌టైన్‌మెంట్‌ను బలంగా నమ్మే వ్యక్తిని నేను. ఓ పాట ద్వారా యువతకు సందేశం చెప్పాలనిపించింది. ‘దేవదాసు పారు వల్ల బ్యాడు..’ అనే పాటను నేనే రాశాను’’అన్నారు. ‘‘సమాజంలోని సంఘటనలను ఈ చిత్రంలో వినోదాత్మకంగా చెబుతున్నాం’’ అన్నారు బాబ్జీ.

చదవండి: ఈ ఓటీటీల్లో ఫ్రీగా చూసేయొచ్చు
సల్మాన్‌కు కొత్త సబ్బు కనిపిస్తే చాలు బ్యాగులో వేసుకుంటాడట!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement