సామాన్యుడి కథతో 'షరతులు వర్తిస్తాయి'... ట్రైలర్ రిలీజ్ | Sharathulu Varthisthai Movie Trailer Launched | Sakshi
Sakshi News home page

సామాన్యుడి కథతో 'షరతులు వర్తిస్తాయి'... ట్రైలర్ రిలీజ్

Mar 3 2024 6:50 PM | Updated on Mar 4 2024 9:24 AM

Sharathulu Varthisthai Trailer Telugu - Sakshi

చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం 'ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి'. కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. ఈ నెల 15న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం నిర్వహించి పలు విషయాలు పంచుకున్నారు.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. నెల తర్వాత బయటపెట్టింది)

'మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ల జీవితాల్లో ఉండే సంతోషాలు, బాధలు, అన్ని ఎమోషన్స్ ఈ కథలో ఉంటాయి. మన మధ్య జరుగుతున్న కథలా ఉంటుంది' అని హీరో చైతన్య రావు చెప్పుకొచ్చాడు. 'ఇదొక మంచి మూవీ. కరీంనగర్ నేపథ్యంలో చేశాం. నేను తెలంగాణ యాస నేర్చుకుని డైలాగ్స్ చెప్పాను' అని హీరోయిన్ భూమి శెట్టి చెప్పింది. ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా ఇదని, ఎలాంటి ఇబ్బందికర సన్నివేశాలు ఇందులో ఉండవని దర్శకుడు రివీల్ చేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి కన్నడ హిట్ సినిమా.. అందులోనే స్ట్రీమింగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement