20 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి.. కామెడీ రోల్‌లో షాలిని!

Shalini Ajith Come Back With Tamil Movie Ponniyin Selvan After 2 Decades - Sakshi

ప్రముఖ తమిళ హీరో అజిత్‌ భార్య, నటి షాలిని పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. 2000 ఏడాదిలో అజిత్‌ను పెళ్లాడిన తర్వాత ఆమె హౌజ్‌ వైఫ్‌గా సెటిలైన విషయం తెలిసిందే. అయితే దాదాపు 20 ఏళ్ల తర్వాత షాలిని మూవీస్‌లో సెకండ్‌ ఇన్నింగ్స్‌​ మొదలు పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న ఓ వెబ్‌ సిరీస్‌లో ఆమె ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. కాగా మణిరత్నం ప్రముఖ తమిళ నవలైన పొన్నియన్‌ సెల్వన్‌ను వెబ్‌ సిరీస్‌గా అదే పేరుతో తెరకెక్కిస్తున్నట్లు గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సిరీస్‌ షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలీం సిటీలో జరుపుకుంటోంది.

ఇందులో హీరో విక్రమ్‌, జయం రవి, ఐశ్వర్యరాయ్‌, త్రిష, కార్తిలు లీడ్‌ రోల్‌ పోషిస్తున్నారు. తాజా ఈ సిరీస్‌లో షాలిని కూడా నటిస్తున్నారని, ఇందులో ఆమె ఓ కామెడీ రోల్‌ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఐశ్యరాయ్‌, కార్తీ, త్రిష, జయం రవీలు ఈ సిరీస్‌ షూటింగ్‌లో పాల్గొన్నారు. కాగా షాలిని ఈ నెల చివరిలో సష్త్రటింగ్‌లో పాల్గొననున్నారని, త్వరలోనే  హైదరాబాద్‌కు రానున్నట్లు సమాచారం. అయితే చివరిగా 2001లో వచ్చిన తమిళ చిత్రం ‘పిరియాధ వరం వెండం’లో షాలినీ నటించారు. ఇందులో హీరో ప్రశాంత్‌కు జోడీగా ఆమె కనిపించారు.

(చదవండి: వైరలవుతోన్న ‘కుట్టి థలా’ ఫోటోలు)
(
హీరో అజిత్‌కి ఏమైంది? షూటింగ్‌ ఫోటో వైరల్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top