అపార్ట్‌మెంట్ యాజమాన్యం వేధింపులు.. అండగా నిలిచిన షకీలా!

Shakeela Support For Batchlors in Chennai with  - Sakshi

సౌత్ ఇండస్ట్రీలో షకీలా పేరు తెలియని ఉండరేమో. అంతలా పేరు సంపాదించింది ఆమె. అయితే ఆమె ఎక్కువగా మళయాళ శృంగార చిత్రాలలో నటించింది. తమిళంలో ప్లేగర్ల్స్ అనే చిత్రంతో ఆమె సినీ కెరీర్‌ ప్రారంభించింది. అయితే ఈ సినిమాలో సిల్క్ స్మిత ప్రధాన కథానాయికగా నటించింది. ఆ తర్వాత  కిన్నెర తుంబికళ్ అనే మళయాళం చిత్రంతో మొదటిసారిగా గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు 110 సినిమాల్లో నటించిన షకీలా తమిళం, మళయాళం, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించింది. ఒకప్పుడు దక్షిణ చిత్రసీమలో ఎక్కువ పారితోషికం తీసుకొన్న నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. షకీలా నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట దగ్గర కోటలో పెరిగింది.

అయితే గత 15 ఏళ్ల నుంచి అడల్ట్‌ సినిమాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ పాత్రలే చేస్తున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సమస్య ఉన్న చోటుకు వెళ్లి దాన్ని పరిష్కరించటానికి తన వంతు కృషి చేస్తున్నారు. తాజాగా షకీల ఓ అపార్ట్‌మెంట్‌ వాసులకు  అండగా నిలిచారు.

అసలేం జరిగిందంటే.. 

చెన్నైలోని చూలైమేడులో చిత్ర రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌ ఉంది. అందులో పెద్ద సంఖ్యలో కుటుంబాలు నివాసముంటున్నాయి. అయితే ఆ అపార్ట్‌మెంట్‌ యజమాన్యం వారి నుంచి అక్రమంగా మెయింటెన్స్‌ వసూలు చేస్తోంది. దాదాపు వారి నుంచి రూ.9 వేలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అంత డబ్బులు కట్టలేమంటూ అపార్ట్‌మెంట్‌ వాసులు ఆందోళనకు దిగారు.

దీంతో యాజమాన్యం వారిని ఇబ్బందులకు గురి చేస్తోంది. వారి అపార్ట్‌మెంట్‌కు మాత్రమే నీళ్లు రాకుండా నిలిపేసింది. ఈ చర్యలతో గత మూడు రోజుల నుంచి నరకయాతన అనుభవిస్తున్నారు. వేధింపులు భరించలేక వారంతా ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. అయితే ఈ విషయం తెలుసుకున్న షకీల అపార్ట్‌మెంట్‌ దగ్గరకు చేరుకున్నారు. నిరసన తెలుపుతున్న మద్దతుగా నిలిచారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది. షకీలకు ఎలాంటి సంబంధం లేకపోయినా వారికి మద్దతుగా నిరసన చేయడం చూసిన నెటిజన్లు సోషల్‌ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top