యాక్షన్ మోడ్

‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ సూపర్ సక్సెస్‌తో ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు షాహిద్ కపూర్. వెంటనే మరో తెలుగు చిత్రం ‘జెర్సీ’ హిందీ రీమేక్‌లో నటిస్తున్నారు. తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు షాహిద్. తెలుగు దర్శక ద్వయం రాజ్, డీకే ఓ యాక్షన్ ప్రధానమైన వెబ్ సిరీస్‌ను రూపొందించనున్నారట. ఇందులో హీరోగా షాహిద్ కపూర్ కనిపిస్తారని సమాచారం. థ్రిల్లర్ జానర్‌లో ఈ సిరీస్ రెండు సీజన్లుగా తెరకెక్కనుంది. ఆల్రెడీ ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో సూపర్ సక్సెస్‌లో ఉన్నారు దర్శకులు రాజ్, డీకే. వచ్చే ఏడాదిలో షాహిద్‌తో చేయబోయే వెబ్ సిరీస్ సెట్స్ మీదకు వెళ్లనుంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి