Pathan Movie-Shah Rukh Fan: ప్లీజ్‌ భయ్యా పఠాన్‌ టికెట్‌ ఇప్పించండి! ‘నీ వల్ల ఏం ఉపయోగం’, వీడియో వైరల్‌

Shah Rukh Khan Die Hard Fan Seeks Pathan Movie Ticket - Sakshi

పలు వివాదాల తర్వాత బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్‌ పఠాన్‌ చిత్రం ఎట్టకేలకు విడుదల కాబోతోంది. హై వోల్డేజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌తో రూపొందిన ఈ మూవీ జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాదాపు అయిదేళ్ల తర్వాత షారుక్‌ వెండితెరపై సందడి చేయబోతోంది. దీంతో ఈ చిత్రంపై బాద్‌షా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో షారుక్‌ వీరాభిమాని ఓ వీడియో షేర్‌ చేశాడు.

తనకు పఠాన్‌ మూవీ టికెట్‌ ఇప్పించాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ రియాన్‌ అనే అభిమాని ఎమోషనల్‌ వీడియో షేర్‌ చేశాడు. ఈ మేరకు అతడు ట్విటర్‌లో వీడియో షేర్‌ చేశాడు. ‘నేను షారుక్‌ ఖాన్‌కు వీరాభిమానిని. ఐ లవ్‌ మై షారుక్‌. జనవరి 25న నేను పఠాన్‌ మూవీ చూడాలి, షారుక్‌ను కలవాల్సిందే. కానీ సినిమా టికెట్‌ కొనడానికి నా దగ్గర డబ్బు లేదు. ప్లీజ్‌ నాకు ఎవరైనా సాయం చేయండి. పఠాన్‌ మూవీ టికెట్‌ పంపించండి. ప్లీజ్‌ భయ్యా నాకు మద్దతు ఇవ్వండి.  లేదండే ఈ పౌండ్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంటా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 

ఇక దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరి అతడికి మద్దతుగా కామెంట్స్‌ చేస్తుంటే మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నీ వల్ల ఈ దేశానికి, నీ కుటుంబానికి ఏం ఉపయోగం లేదు. ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం జీవితాన్నే పొగొట్టుకునేందుకు సిద్దపడ్డావు. ఈ సినిమా వల్ల నీ జీవితంలో ఏమైనా మార్పు వస్తుందా? ఇదేం నీకు గుర్తింపు, గౌరవం ఇవ్వదు. సినిమాకు వినోదంలా మాత్రమే చూడండి’ అంటూ కామెంట్‌ చేయగా ‘మీరు ఎక్కడ ఉంటారు భయ్యా.. నేను మీకు సాయం చేస్తాను’ అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ‘మరి ఇంత డ్రామా చేయకు’ అంటూ ఇంకో నెటిజన్‌ వ్యంగ్యంగా స్పందించాడు. కాగా పఠాన్‌ మూవీ టికెట్లు ఇప్పటికే లక్షకు పైగా అడ్వాన్స్‌ బుక్‌ అయినట్లు ట్రెడ్‌ వర్గాల నుంచి సమాచారం.

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top