
ప్రముఖ డైరెక్టర్, దివగంత ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన 'చాలా బాగుంది' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ మాళవిక. శ్రీకాంత్, నవీన్ హీరోలుగా నటించిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాలతో అలరించిన మాళవిక కొన్నాళ్లకు సినిమాలకు దూరమైంది.
Senior Heroine Malavika Re Entry With Director Sundar C Movie: ప్రముఖ డైరెక్టర్, దివగంత ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన 'చాలా బాగుంది' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ మాళవిక. శ్రీకాంత్, నవీన్ హీరోలుగా నటించిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాలతో అలరించిన మాళవిక కొన్నాళ్లకు సినిమాలకు దూరమైంది. 1999లో సుందర్. సి డైరెక్షన్‌లో అజిత్ హీరోగా 'ఉన్నై తేడి' మూవీతో కోలీవుడ్‌కు పరిచయమైంది మాళవిక. తర్వాత 2007లో సురేష్ మేనన్ అనే వ్యక్తిని వివాహమాడి వైవాహిక జీవితానికే పరిమితమైంది. ఇప్పుడు తాజాగా ఆమె మళ్లీ వెండితెరపై సందడి చేయనుంది.
చదవండి: 'పేరెంట్స్ కోప్పడ్డారు..ఆ సినిమా చేసినందుకు బాధపడుతున్నా'
కోలీవుడ్‌కు ఏ డైరెక్టర్‌తో పరిచయమైందో ఆయన దర్శకత్వంలోనే మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుంది మాళవిక. ఈ సినిమాలో ఆమె 'మంగమ్మ' అనే పాత్రలో అలరించనుంది. ఇందులో మాళవికకు జోడిగా దర్శకుడు మనోబాలా కనిపించనున్నారు. హీరోలుగా జై, జీవా, శ్రీకాంత్ నటిస్తున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్, రైజా విల్సన్, ఐశ్వర్య దత్తా హీరోయిన్లుగా సందడి చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లో పాల్గొన్న మాళవిక ఫొటోలను సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం విడుదల చేసింది. ఇంకా ఈ సినిమాకు టైటిల్ ఖరారు కాలేదు. షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం.
— Manobala (@manobalam) April 2, 2022