'డైరెక్టర్‌ శేఖర్‌కమ్ముల న్యాయం చేస్తానని మాటిచ్చారు'

Sekhar Kammula Meets Singer Komali Over Saranga Dariya​ Controversary - Sakshi

గాయని కోమలిని కలిసిన శేఖర్‌ కమ్ముల

నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా  ‘లవ్ స్టోరి’. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని ‘సారంగ దరియా’ పాట యూట్యూబ్‌లో దుమ్ము రేపుతోంది. అతి తక్కువ సమయంలో యూట్యూబ్‌లో 50 మిలియన్‌ వ్యూస్ క్రాస్‌ చేసిన  తొలి తెలుగు పాటగా నిలిచింది. మరోవైపు దీనిపై వివాదం కూడా అదే స్థాయిలో నెలకొంది. పల్లెల్లో ఉన్న ఈ పాటను వెలుగులోకి తీసుకొచ్చింది తానేనంటూ గాయని కోమలి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ పాటను తనతోనే పాడిస్తానని మాటిచ్చి, మోసం చేశారని తన బాధను చెప్పుకుంది. తాజాగా ఈ విషయంపై చర్చించేందుకు గాయని కోమలి..శేఖర్‌కమ్ములను కలిసింది.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..'సారంగ దరియా పాట విషయంపై ఇకపై తనకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల తన నెక్స్ట్‌ సినిమాలో అవకాశం ఉంటే నాతో తప్పకుండా పాట పాడిస్తానని మాటిచ్చారు. అంతేకాకుండా ఈ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమంలోనూ స్టేజీ మీద సారంగ దరియా పాటను నాతోనే పాడిస్తానన్నారు' అని సంతోషం వ్యక్తం చేసింది. మరోవైపు డైరెక్టర్‌ శేఖర్‌కమ్ముల సైతం ఈ విషయాన్ని అంగీకరించారు. భవిష్యత్‌లో తన సినిమాలో జానపద పాట పాడించే అవకాశం వస్తే తప్పకుండా కోమలికి అవకాశం ఇస్తానని తెలిపారు. ఇంతటితో ఈ వివాదం ముగిసిందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 

చదవండి : ('సారంగదరియా నా పాట, కానీ నాతో పాడించలేదు')
(సాయి పల్లవి దెబ్బకు ‘బుట్ట బొమ్మ’ ఔట్!‌)

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top