హిట్‌ సినిమా రీమేక్‌లో...

Sasikumar with Aishwarya Rajesh in Mundhanai Mudichu remake - Sakshi

తమిళ దర్శకుడు, నటుడు కె. భాగ్యరాజా తెరకెక్కించిన సూపర్‌ హిట్‌ తమిళ చిత్రం ‘ముందానై ముడిచ్చు’ (1983). భాగ్యరాజా, ఊర్వశి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం తాజాగా రీమేక్‌ కాబోతోంది. ఈ రీమేక్‌లో హీరోయిన్‌గా ఐశ్వర్యా రాజేష్‌ నటిస్తారు. ఊర్వశి చేసిన పాత్రను ఐశ్వర్య చేయనున్నారు. హీరోగా దర్శకుడు శశికుమార్‌ నటిస్తారు. ఈ రీమేక్‌కు కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు భాగ్యరాజానే అందిస్తుండటం విశేషం. జేయస్బీ ఫిల్మ్‌ స్టూడియో బ్యానర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అప్పట్లో ఈ సినిమాను ‘మూడు ముళ్లు’గా తెలుగులో రీమేక్‌ చేశారు దర్శకులు జంధ్యాల. చంద్రమోహన్, రాధిక ముఖ్య పాత్రల్లో నటించారు. భార్య చనిపోయిన ఓ టీచర్‌ని  ప్రేమించిన అమ్మాయి తన ప్రేమను ఎలా గెలుచుకుంది? అన్నది చిత్రకథాంశం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top