ప్రతీ ఇంట్లో జరిగే కథే ‘సారంగదరియా’: నవీన్‌చంద్ర | Sarangadariya Movie Pre Release Event Highlights | Sakshi
Sakshi News home page

ప్రతీ ఇంట్లో జరిగే కథే ‘సారంగదరియా’: నవీన్‌చంద్ర

Jul 10 2024 4:53 PM | Updated on Jul 10 2024 8:19 PM

Sarangadariya Movie Pre Release Event Highlights

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సారంగదరియా’. ఈ మూవీతో పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జులై 12న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు మేకర్స్‌. ఈ కార్యక్రమానికి హీరో నవీన్ చంద్ర ముఖ్య అతిథిగా విచ్చేసి బిగ్ టికెట్‌ను కోనుగోలు చేశారు. 

ఈ సందర్భంగా నవీన్‌చంద్ర మాట్లాడుతూ.. ‘రాజా రవీంద్ర ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంటూ.. మాలాంటి కొత్త యాక్టర్లకు సపోర్ట్, గైడెన్స్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తుంటారు. ఈ చిత్రంలో ఆయన చాలా కొత్తా కనిపిస్తున్నారు. పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇలాంటి చిత్రాన్ని నిర్మించిన ఉమాదేవి, శరత్ చంద్ర థాంక్స్. ప్రతీ ఇంట్లో జరిగే కథలా అనిపించింది. దర్శకుడు మంచి మెసెజ్ ఇచ్చేందుకు ఈ చిత్రం తీశారని అర్థం అవుతోంది.ఈ చిత్రాన్ని తప్పకుండా థియేటర్లోనే చూడండి’ అని ప్రేక్షకులను కోరారు.

రాజా రవీంద్ర మాట్లాడుతూ.. ‘కంటెంట్ బాగుండటంతో బలగం ఆడింది. మన సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోందని కచ్చితంగా హిట్ అవుతుందని నిర్మాత చెబుతుంటూ ఉంటారు. పండు టీం అందరితో చక్కగా పని చేయించుకున్నాడు. మా నిర్మాత సైతం దర్శకుడు పండుకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. మా చిత్రం జూలై 12న రాబోతోంది. అందరూ వీక్షించండి. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ మీద పోరాటం చేస్తోంది. దయచేసి అందరూ డ్రగ్స్‌కి దూరంగా ఉండండి. సోషల్ మీడియాలో దుర్భాషలు ఆడకండి.. ట్రోలింగ్ చేయకండి’ అని అన్నారు.

‘సమానత్వం అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రాబోతోంది. ఇలాటి కథ చెప్పినప్పుడు సహజంగా ఎవ్వరూ ఒప్పుకోరు. కానీ మా సాయిజా ప్రొడక్షన్స్ అధినేత శరత్ గారు వెంటనే ఒప్పుకున్నారు. క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది’అని దర్శకుడు పండు అన్నారు.  ఈ ఈవెంట్‌లో నిర్మాత శరత్ చంద్ర చ‌ల్ల‌ప‌ల్లి, మ్యూజిక్ డైరెక్టర్ ఎబెనెజర్ పాల్ , నటి యశస్విని, లిరిక్ రైట‌ర్స్ క‌డ‌లి, గోశాల రాంబాబు, ఆదిత్య నిరంజ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement