దుబాయ్‌ చేరుకున్న నటుడు సంజయ్‌ దత్‌

Sanjay Dutt Returns To Dubai After A Short Stay In Mumbai - Sakshi

దుబాయ్‌: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ మరోసారి దుబాయ్‌ పయనమయ్యారు. గత కొన్ని రోజులుగా ముంబైలోనే ఉన్న ఆయన.. తాజాగా దుబాయ్‌కు వెళ్లారు. గతేడాది సంజయ్‌ క్యాన్సర్‌కు గురయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లండన్‌కు వెళ్లి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయన క్యాన్సర్‌ నుంచి కోలుకున్న‌ట్లు అక్టోబరులో ప్ర‌క‌టించారు.  

కొంత‌కాలంగా భార్య మాన్య‌త, పిల్ల‌లు షారాన్‌, ఇఖ్రాల‌తో క‌లిసి దుబాయ్‌లో ఉంటున్న సంజయ్‌దత్‌ పది రోజుల క్రితం ఒంటరిగా ముంబైకు ఎందుకు వచ్చారన్న కారణాలు తెలియలేదు. ట్రిప్‌లో భాగంగా కేంద్ర ర‌వాణాశాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ, ఆయ‌న భార్య కాంచ‌న్ గ‌డ్క‌రీని సంజ‌య్ ద‌త్ ఆదివారం నాగ‌పూర్‌లోని వారి నివాసంలో కలిసిన సంగతి తెలిసిందే.  

సంజయ్ దత్ ఏ కారణంగా గడ్కరీతో భేటీ అయ్యారన్నది తెలియదు. ఇరువరి మధ్య ఏ విషయంపై చర్చలు జరిగాయన్నది తెలియరాలేదు. ఇక సినిమాల విషయానికి వస్తే సంజయ్‌ దత్‌ న‌టించిన కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ విడుదలకు సిద్ధమౌతుంది.ఈ చిత్రంలో సంజ‌య్ నెగటివ్ రోల్‌లో కనిపించనున్నాడు. బ్లాక్ బస్టర్ ''కేజీఎఫ్ చాప్టర్ 1'' కు సీక్వెల్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. అదే విధంగా “పృథ్వీరాజ్”, “భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా” లలో కూడా సంజ‌య్‌ కనిపించనున్నాడు. 

చదవండి : 
కె.జి.యఫ్ నుంచి మరో అప్​డేట్

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top