సందీప్‌ కిషన్‌ పాన్‌ ఇండియా మూవీ నుంచి రొమాంటిక్‌ సాంగ్‌ అప్పుడే! | Sandeep Kishan and Divyansha Kaushik Michael Poster Release | Sakshi
Sakshi News home page

సందీప్‌ కిషన్‌ పాన్‌ ఇండియా మూవీ నుంచి రొమాంటిక్‌ సాంగ్‌ అప్పుడే!

Published Mon, Dec 26 2022 1:07 AM | Last Updated on Mon, Dec 26 2022 10:27 AM

Sandeep Kishan and Divyansha Kaushik Michael Poster Release - Sakshi

సందీప్‌ కిషన్, దివ్యాంశా కౌశిక్‌ ‘నువ్వుంటే చాలు...’ అని ప్రేమ పాట పాడుకున్నారు. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘మైఖేల్‌’ చిత్రంలోని పాట ఇది. సినిమాలోని ఈ తొలి పాటను ఈ 28న విడుదల చేయనున్నారు. ఆదివారం ఈ విషయాన్ని ప్రకటించి, పాటలోని ఓ పోస్టర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. రంజిత్‌ జయకొడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, కరణ్‌ సి ప్రొడక్షన్స్‌ ఎల్‌ఎల్‌పితో కలిసి డిస్ట్రిబ్యూటర్‌ భరత్‌ చౌదరి, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మించిన ఈ చిత్రానికి నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌ సమర్పకులు.

‘‘సందీప్‌ కిషన్‌కి తొలి పాన్‌ ఇండియా చిత్రం ఇది. ఈ సినిమా కోసం సందీప్‌ అద్భుతంగా మేకోవర్‌ అయ్యారు. సామ్‌ సీఎస్‌ మంచి పాటలు ఇచ్చారు. రొమాంటిక్‌ సాంగ్‌ ‘నువ్వుంటే చాలు..’ని తెలుగు, తమిళ భాషల్లో ఈ 28న విడుదల చేయనున్నాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు. డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌ విలన్‌గా నటించిన ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి, వరలక్ష్మీ శరత్‌కుమార్, వరుణ్‌ సందేశ్‌ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి కెమెరా: కిరణ్‌ కౌశిక్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యుసర్‌: కె. సాంబశివరావు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement