‘తలైవి‘ ఫస్ట్‌ సాంగ్‌ విడుదల చేసిన సమంత | Samantha Akkineni Launch Thalaivi Movie First Song On Twitter | Sakshi
Sakshi News home page

‘తలైవి’ మూవీ సాంగ్‌ను షేర్‌ చేసిన సమంత

Apr 2 2021 3:28 PM | Updated on Apr 2 2021 3:59 PM

Samantha Akkineni Launch Thalaivi Movie First Song On Twitter - Sakshi

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్ కంగనా రనౌత్‌‌ తాజా చిత్రం ‘తలైవి’. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరపుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఓ పాటను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఇలా ఇలా తెలాను.. ఆంటు సాగే ఈ పాటకు కంగనా స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. టీ-సిరీస్‌ సంస్థ ద్వారా శుక్రవారం సమంత తెలుగు, తమిళం, హిందీ మూడు భాషల్లో ఈ పాటను విడుదల చేసింది. 

ఈ సందర్భంగా అక్కినేని వారి కోడలు, హీరోయిన్‌ సమంత 3 భాషల యూట్యూబ్‌ లింక్‌ను షేర్‌ చేసింది. దీనికి ‘అమ్మ దయ, జాలికి ఏదీ సాటి లేదని అందరి తెలుసు. ఆమె జీవిత కథ తెరపైకెక్కతున్న విషయం తెలిసిందే. సినిమా నుంచి సీఎం దాకా అమ్మ ఎలా ఎదిగారు, ఆమె ఎదురైన చేదు అనుభవాలను ఈ చిత్రం అభిమానులకు సాక్ష్యం ఇవ్వబోతోంది’ అంటూ ట్వీట్‌ చేసింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ మూవీని దర్శకుడు ఎ.ఎల్‌ విజయ్‌ తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళంతో హిందీలో ఈ మూవీ ఏప్రీల్‌ 23న విడుదలకు కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement