సల్మాన్‌ ఖాన్‌, దిల్‌ రాజు ప్రాజెక్ట్‌ ప్రారంభం | Salman Khan and Vamsi Paidipally launch new project today at Mumbai | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ ఖాన్‌, దిల్‌ రాజు ప్రాజెక్ట్‌ ప్రారంభం

Apr 18 2026 10:56 AM | Updated on Apr 18 2026 11:17 AM

Salman Khan and Vamsi Paidipally launch new project today at Mumbai

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సల్మాన్‌ ఖాన్‌ తెలుగు దర్శకనిర్మాతలతో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పూజా కార్యక్రమం నేడు ముంబైలో జరగనుంది. దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మాత దిల్‌ రాజు నిర్మించనున్నారు. ఈ మూవీ ప్రకటనతోనే బాలీవుడ్,  టాలీవుడ్ వర్గాలలో భారీ చర్చకు దారితీసింది. నేడు షూటింగ్‌ ప్రారంభం కానున్నడంతో చాలామంది ప్రముఖులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గతంలో బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి, వారసుడు వంటి హిట్‌ సినిమాలకు దర్శకుడిగా పనిచేసిన వంశీ పైడిపల్లి.. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోతోనే ఒక ప్రాజెక్ట్‌ చేస్తున్నటం విశేషం.  సల్మాన్‌కు జోడీగా నయనతార నటించనున్నట్లు తెలుస్తోంది. సౌత్‌ ఇండియా మేకర్స్‌తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్‌ స్టార్స్‌ చాలా ఆసక్తిగా ఉన్నారనే విషయం తెలిసిందే. ఇప్పటికే షారుఖ్‌ ఖాన్‌ తమిళ దర్శకుడు అట్లీతో జవాన్‌ మూవీలో పనిచేశారు. సన్నీ డియోల్‌ జాట్‌ మూవీ కోసం తెలుగు దర్శకుడు గోపీచంద్‌ మలినేనితో వర్క్‌ చేశారు. అమితా బచ్చన్‌, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా, ఐశ్వర్య రాయ్‌ వంటి స్టార్స్‌ కూడా సౌత్‌ మేకర్స్‌తో పనిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement