సాయిపల్లవి రిజక్ట్ చేసిన సినిమాలు ఏవో తెలుసా?.. అన్ని డిజాస్టర్లే! | Here's The List Of Sai Pallavi Rejected Movies Which Became Disasters, Deets Inside - Sakshi
Sakshi News home page

Sai Pallavi Rejected Movies List: సాయిపల్లవి రిజక్ట్ చేసిన సినిమాలు ఏవో తెలుసా?.. అన్ని డిజాస్టర్లే!

Published Mon, Feb 12 2024 7:42 AM

Sai Pallavi Rejected Movies List - Sakshi

దక్షిణాది హీరోయిన్లలో నటి సాయిపల్లవిది ప్రత్యేక శైలి. ఈమె స్వతహాగా వైద్యురాలు. నటనంటే ఇష్టంతో సినీ రంగ ప్రవేశం చేశారు. అందుకే పెళ్లిని కూడా వాయిదా వేసి తన చెల్లెలి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు. సాయిపల్లవి కెరీర్‌లో మరచిపోలేని చిత్రం ప్రేమమ్‌. ఆ చిత్రం లేకపోతే ఈమె లేరనే చెప్పవచ్చు. సహజత్వానికి ప్రాధాన్యత ఇచ్చే ఈమె మేకప్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. సాయిపల్లవి చేసే పాత్రలు కూడా అలానే ఉంటాయి. అందుకే పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. పాత్రల ఎంపికలో ఆచి తూచి అడుగేస్తారు. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎంత పెద్ద హీరో చిత్రాన్ని అయినా నిరాకరిస్తారు.

అలా ఆమె తిరస్కరించిన చాలా చిత్రాలు అపజయం పాలయ్యాయి. ముఖ్యంగా ఇటీవల చిరంజీవితో భోళా శంకర్‌ చిత్రంలో నటించే అవకాశం రాగా దాన్ని సాయిపల్లవి నిర్భంధంగా తోసి పుచ్చారు. తీరా ఆ చిత్రం విడుదలై బాక్సాపీస్‌ వద్ద బోల్తా కొట్టింది. అంతకు ముందు కామ్రేడ్‌ చిత్రంలో విజయ్‌ దేవరకొండ సరసన నటించే అవకాశం ముందు సాయిపల్లవికే వచ్చిందట. అయితే అందులో ముద్దు సన్నివేశాలు అధికంగా ఉండడంతో అందులో నటించనన్నారట. ఆ తరువాత ఆ పాత్రలో రష్మిక నటించారు. ఆ చిత్రం నిరాశపరచింది. ఇక తమిళంలో అజిత్‌ సరసన వలిమై చిత్రంలో నటించే అవకాశం తలుపు తట్టినా, పాత్ర నచ్చకపోవడంతో నో చెప్పారు.


ఇటీవల నటుడు విజయ్‌కు జంటగా లియో చిత్రంలోనూ నాయకిగా సాయిపల్లవిని నటింపచేసే ప్రయత్నం జరిగింది. అందులోని పాత్రలో నటనకు అవకాశం లేదంటూ వద్దన్నారు. ఆ చిత్రం భారీ వసూళ్లు రాబట్టినా విమర్శలను ఎదుర్కొంది. ఇక చంద్రముఖి–2 నటి కంగనా రనౌత్‌ పోషించిన పాత్రలో ముందు సాయిపల్లవిని సంప్రదించారు. ఆ కథ నచ్చకపోవడంతో సారీ చెప్పేశారు. ఆ చిత్రం ప్లాప్‌ అయ్యింది. ఇలా సాయిపల్లవి రిజెక్ట్‌ చేస్తే.. ఇక అంతే అనే ప్రచారం సోషల్‌ మీడియాలో సాగుతోంది. కాగా ప్రస్తుతం కమలహాసన్‌ నిర్మిస్తున్న చిత్రంలో శివకార్తికేయన్‌ సరసన సాయిపల్లవి నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement