Sai Pallavi Enjoying Amarnath Yatra Trip Shares Pics In Social Media Goes Viral - Sakshi
Sakshi News home page

Sai Pallavi: ఆధ్యాత్మిక బాటపట్టిన సాయి పల్లవి.. అమర్‌నాథ్‌ సన్నిధిలో పూజలు!

Jul 10 2023 1:06 PM | Updated on Jul 10 2023 1:30 PM

Sai Pallavi Enjoying Amarnath Yatra Trip Shares Pics In Social Media - Sakshi

ఇదివరకు తెలుగులో వరుసగా చిత్రాలు చేస్తూ వచ్చిన సాయిపల్లవి అనూహ్యంగా గ్యాప్‌ తీసుకున్నారు. అవకాశాలు రాక కాదు. వచ్చిన అవకాశాలు నచ్చక అనేది ప్రచారంలో ఉంది. ఇక తమిళంలో కొన్ని చిత్రాలు చేసినా అవి ఆశించిన విజయాలను సాధించలేదు. ఏదేమైనా చిన్న గ్యాప్‌ తరువాత ఈమె తమిళంలో కమలహాసన్‌ తన రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మిస్తున్న చిత్రంలో కథానాయకిగా నటిస్తున్నారు.

(ఇది చదవండి: ఈ వారం కొత్త సినిమాల సందడి.. ఓటీటీలోనే ఎక్కువ!)

శివకార్తికేయన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. శివకార్తికేయన్‌ సైనికుడిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను కాశ్మీర్‌లో కొన్ని రోజులు చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్‌కు గ్యాప్‌ రావడంతో నటుడు శివకార్తికేయన్‌ తన కథానాయకుడిగా నటించిన మా వీరన్‌ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

మరి సాయిపల్లవి ఏం చేశారంటే ఏకంగా పాదయాత్ర చేపట్టారు. అదేనండీ భక్తి మార్గం. అవును ఇప్పుడు అమర్‌నాథ్‌ యాత్ర సీజన్‌ జరుగుతోంది కదా. సాయిపల్లవి కశ్మీర్‌లోని అమరనాథ్‌ యాత్రకు కాలిబాటన పయనించారు. అక్కడ హిమ లింగేశ్వరుడిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. సాయిపల్లవిని చూసిన భక్తులు, సామాన్య ప్రజలు ఆమెతో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపించారు.

(ఇది చదవండి: ఆమె జీవితమంతా కష్టాలు, కన్నీళ్లే.. కానీ ఇప్పుడామె స్టార్ హీరోయిన్! )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement