సాయిధరమ్‌తేజ్‌ ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసిన వైద్యులు

Sai Dharam Tej Health Bulletin Released By Apollo Hospital Doctors - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాయిధర్‌మ్‌ తేజ్‌కు ప్రాణాపాయం లేదని.. ఎటువంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఆయన పరిస్థితిపై అపోలో వైద్యులు అర్ధరాత్రి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. సాయిధరమ్‌ తేజ్‌ కాలర్‌ బోన్‌ విరిగిందని.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామన్నారు. 48 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచుతామని తెలిపారు.

ప్రముఖ టాలీవుడ్‌ హీరో, మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ శుక్రవారం రాత్రి బైక్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. జూబ్లీ హిల్స్‌ రోడ్డు నంబర్‌-45 కేబుల్‌ బ్రిడ్జ్‌ మార్గంలో స్పోర్ట్స్‌ బైక్‌పై వెళ్తుండగా అతను ఈ ప్రమాదానికి గురయ్యారు. కుడి కన్నుపై, ఛాతీ, పొట్ట భాగంలో తీవ్రగాయాలయినట్లు డాక్టర్లు తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top