సైకో థ్రిల్లర్‌గా 'దక్షిణ'.. ట్రైలర్‌తోనే భయపెట్టారు! | Sakshi
Sakshi News home page

Dakshina Movie Trailer: కబాలి ఫేమ్ సైకో థ్రిల్లర్‌ మూవీ.. ట్రైలర్‌తోనే భయపెట్టారు!

Published Wed, May 15 2024 3:15 PM

Sai Dhanshika Dakshina Movie Trailer Out Now

కబాలి ఫేమ్ సాయి ధన్షిక ప్రధానపాత్రలో వస్తోన్న చిత్రం దక్షిణ.  మంత్ర, మంగళ సినిమాలతో మెప్పించిన ఓషో తులసి రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  కల్ట్ కాన్సెప్ట్స్ మూవీ బ్యానర్‌పై  అశోక్ షిండే నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రిషవ్ బసు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను డైరెక్టర్‌ బుచ్చిబాబు సనా రిలీజ్‌ చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబు మాట్లాడుతూ... 'ఈ మధ్య కాలంలో నన్ను బయపెట్టిన ట్రైలర్ ఇదే.  తులసి రామ్ టాలీవుడ్‌కి మరో ట్రెండ్ సెట్టర్.  దక్షిణ సినిమాతో  సైకో థ్రిల్లర్‌ను ఇవ్వబోతున్నారు' అంటూ అభినందించారు. కాగా.. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాతలతో పాటు చిత్రబృందం కూడా పాల్గొన్నారు. ఈ సినిమా సైకో థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా చూసేటప్పుడు ఏం జరుగుతోందన్న సస్పెన్స్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ కలిగిస్తుందని నిర్మాత అశోక్‌ షింజే అన్నారు.  త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

 

Advertisement
Advertisement