ఓటీటీలోకి సూపర్‌ హిట్‌ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ | Sakshi
Sakshi News home page

Saba Nayagan OTT Streaming: వాలంటైన్స్‌డే గిఫ్ట్‌.. ఓటీటీలోకి సూపర్‌ హిట్‌ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ చిత్రం

Published Sun, Jan 28 2024 4:32 PM

Saba Nayagan OTT Streaming On Hotstar - Sakshi

ప్రతి వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇప్పటికే ప్రేమ కథలతో పాటు థ్రిల్లర్‌ చిత్రాలు కూడా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. అలాంటిది ప్రేమికుల దినోత్సవం రోజున ఎలాంటి సినిమా ఉంటే బాగుంటుందో అలాంటి రొమాంటిక్‌  డ్రామా మూవీని ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు హాట్‌స్టార్‌ తెలిపింది. తమిళంలో సూపర్‌ హిట్‌ కొట్టిన 'సబా నాయగన్' స్ట్రీమింగ్‌కు రెడీగా ఉంది. ఇందులో కలర్ ఫొటో సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న 'చాందిని చౌదరి' ప్రధాన పాత్రలో నటించింది.

భద్రమ్, మన్మధ లీల, పిజ్జా 2 సినిమాలతో 'అశోక్ సెల్వన్' హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన అనేక తమిళ చిత్రాలు తెలుగులోకి డబ్‌ అయ్యాయి. దీంతో టాలీవుడ్‌లో కూడా అశోక్‌ సెల్వన్‌కు గుర్తింపు ఉంది. చాందినీ చౌదరితో కలిసి నటించిన సబా నాయగన్ చిత్రం 2023 డిసెంబర్‌లో విడుదలైంది. రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్‌ ఉన్నారు.  ఈ సినిమాతో సీఎస్ కార్తికేయ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. కమల్ హాసన్ నటించిన 'విశ్వరూపం, విశ్వరూపం 2' చిత్రాలకు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు.

తమిళంలో భారీ హిట్‌ అందుకున్న 'సబా నాయగన్‌' చిత్రం ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు హాట్‌స్టార్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ఒక వీడియో విడుదల చేసింది. ఒక టికెట్‌కు నాలుగు సినిమాలు అంటూ 'జో,ఫైట్‌ క్లబ్‌, పార్కింగ్‌' ఇప్పటికే స్ట్రీమింగ్‌ అవుతున్నాయని.. 'సబా నాయగన్‌' ఫిబ్రవరి 14న వాలంటైన్స్‌డే సందర్భంగా రానుందని హాట్‌స్టార్‌ తెలిపింది. ఈ చిత్రం కూడా తెలుగులో కూడా స్ట్రీమింగ్‌ కానుంది.

'సబా నాయగన్‌' సినిమా కోసం చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.  డీస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఫిబ్రవరి 14 నుంచి సబా నాయగన్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటన రావడంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. అయితే ఇంతకుముందు ఫిబ్రవరి 1 నుంచి సబా నాయగన్ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఫిబ్రవరి 14న స్ట్రీమింగ్ చేస్తే మేకర్స్‌కు, ఓటీటీ సంస్థకు కలిసి వస్తుందని వాయిదా వేసి ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు అక్కడ 3 స్టార్‌ రేటింగ్‌తో పాటు Imbd నుంచి 8.1 రేటింగ్‌ అందుకుంది.

Advertisement
Advertisement