ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తు పట్టారా?

Saba Ali Khan Shares Sara Ali Khan Childhood Photo Goes Viral - Sakshi

లాక్‌డౌన్‌లో సెలబ్రెటీలు తమకు సంబంధించిన జ్ఞాపకాలను, వారి చిన్ననాటి ఫొటోలను షేర్‌ చేస్తూ నెటిజన్లకు ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ స్టార్‌ హీరోహీరోయిన్ల చిన్న ఫొటోలు బయటకు రావడంతో అవి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉండగా బాలీవుడ్‌ స్టార్‌హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ సోదరి సబా అలీ ఖాన్‌ గత కొద్ది రోజులు తన కుటుంబ సభ్యులకు సంబంధించిన పాత ఫొటోలను షేర్‌ చేస్తూ వారితో తనకున్న అనుభూతిని పంచుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తన మేనకోడలు, సైఫ్‌ ముద్దుల తనయ, నటి సారా అలీ ఖాన్‌ చిన్ననాటి ఫొటోను కూడా షేర్‌ చేశారు. క్యూట్‌ నవ్వుతూ ఫొటోకు ఫోజ్‌ ఇచ్చిన సారా చిన్ననాటి ఫొటో ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ హల్‌ చల్‌ చేస్తుంది. 

దీనికి సబా ‘నేను సారాతో నవ్వమని చెప్పాను. కానీ తను ఇది బెటర్‌ అని నిర్ణయించుకుంది’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను జత చేశారు. అంతేగాక సారా ఇలా తన అల్లరితో ఎప్పుడు నవ్విస్తుందంటూ మనకోడలిపై ప్రేమను కురిపించారు ఆమె. అలాగే ఇదే ఫొటోను సారా కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలో షేర్‌ చేశారు. కాగా సారా చిన్ననాటి ఫొటీ చూసి ఆమె అభిమానులు, ఫాలోవర్స్‌ మురిసిపోతున్నారు. సారా ఫొటో షేర్‌ చేసినందుకు సబాకు నెటిజన్లు ధన్యవాదాలు తెలుపుతున్నారు. 

చదవండి: 
ఓటీటీ: ఈ వారం కొత్త సరుకు, ఓ లుక్కేయండి 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top