Money Laundering Case: ఈడీ విచారణకు బాలీవుడ్ నటి నోరా

మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్‌పై నమోదైన మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి నోరా ఫతేహిని ఈడీ శుక్రవారం ప్రశ్నించింది. సుకేశ్ భార్య లీనా ఆహ్వానం మేరకు 2020లో చెన్నైలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో జరిగిన కార్యక్రమానికి ఆమె వెళ్లింది.
ఆ సందర్భంగా కొత్త ఐఫోన్, ఖరీదైన బ్యాగ్‌తో పాటు బీఎండబ్యూ కారు అందజేశారని ఈ సందర్భంగా నోరా వెల్లడించిందని ఈడీ వర్గాలు తెలిపాయి. మరిన్ని వివరాల కోసం ఆమెకు మళ్లీ సమన్లు జారీ చేసే అవకాశాలున్నాయని తెలిపాయి.