వచ్చే ఏడాది ఉగాదికి ఆర్ఆర్ఆర్?

Is RRR Release Postponed, Confirmed For Ugadi 2022 - Sakshi

ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే ప్రేక్షకులు రెండు విషయాలు ఆలోచిస్తారు. ఒకటి ఆ చిత్రం ఎన్ని రికార్డుల బ్రేక్ చేస్తుంది, రెండోది విడుదలకు ముందు ఎన్ని సార్లు వాయిదా పడుతుంది. ప్రస్తుతం జక్కన్న ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ భారీ బ‌డ్జెట్ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డ్డ ఆర్ఆర్ఆర్ అక్టోబ‌ర్13న త‌ప్ప‌క ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావిస్తుండగా తాజాగా మరోసారి వాయిదా పడుతుందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

కోవిడ్ కారణంగా సినిమా రంగంతో పాటు అన్ని రంగాలు దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. కట్టడి అనంతరం థియేటర్లు పూర్తి స్థాయిలో రీ ఓపెన్ కాకపోవడంతో ఇప్పటికే చిన్న సినిమాలు ఓటీటీలో విడుదల అవుతున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలు మాత్రం థియేటర్లో ప్రదర్శించాలని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని మొదట సంక్రాంతి, ఆ తరువాత అక్టోబ‌ర్‌లో అనుకున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం వ‌చ్చే ఏడాది ( 2022) ఉగాదికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నార‌ట‌. ఈ ఏడాది అక్టోబర్ కి కుదరకపోయినా సంక్రాంతికి రిలీజ్ అని అనుకున్న‌ప్ప‌టికీ ఆ స‌మ‌యంలో ప‌లు సినిమాల‌కు సంబంధించిన రిలీజ్ డేట్స్ ఇప్ప‌టికే వ‌చ్చేశాయి.

ఇప్పుడు వాటిని డిస్ట్రబ్ చేయడం ఇష్టం లేకనే సంక్రాంతి బరిలో కాకుండా ఉగాదికి తెచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.  కాగా దీని సంబంధించి అధికారిక ప్రకటన త్వ‌ర‌లోనే రానుంద‌ని స‌మాచారం.ఇటీవలే ఉక్రెయిన్‌లో ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ పూర్తి చేయ‌గా, ప్ర‌స్తుతం చిత్ర బృందం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్‌తో బిజీగా ఉంది. రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్ లో నిర్మించారు. అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ థీమ్ సాంగ్ దోస్తీకి అన్ని భాషల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top