అహింస కొత్తగా ఉంటుంది

RP Patnaik Speech At Ahimsa Pre Release Event  - Sakshi

– ఆర్పీ పట్నాయక్‌

‘‘అహింస’ కథ చాలా కొత్తగా ఉంటుంది.. కథ కొత్తగా ఉన్నప్పుడు పాట సహజంగానే కొత్తగా వినిపిస్తుంది. ఈ చిత్రం పాటలకు మంచి స్పందన వస్తోంది’’ అన్నారుసంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌. అభిరామ్, గీతికా తివారి జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అహింస’.

పి. కిరణ్‌ నిర్మించిన ఈ సినిమా జూన్‌ 2న రిలీజ్‌ కానున్న సందర్భంగా ఈ చిత్ర సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ మాట్లాడుతూ– ‘‘అహింస సిద్ధాంతం నమ్మే ఓ అబ్బాయిని పరిస్థితులు ఎలా కృష్ణతత్వంవైపు లాగాయనేది ఈ చిత్రకథ. నా దర్శకత్వంలో ఒక మ్యూజికల్‌ ఫిల్మ్‌ ప్లాన్‌ చేస్తున్నాను. ఎన్నికల నేపథ్యంలో ఓ కథ రెడీ చేశాను. నిర్మాతలు దొరికితే ఏడాదికి 4 చిత్రాలకు దర్శకత్వం వహిస్తా. వెబ్‌ సిరీస్‌ కోసం రెండు కథలు రాశాను’’ అన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top