యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ | Sakshi
Sakshi News home page

యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌

Published Sat, Nov 4 2023 3:01 AM

Roti Kapada Romance is an out and out youthful entertainer: Star producer Dil Raju - Sakshi

హర్ష నర్రా, సందీప్‌ సరోజ్, తరుణ్, సుప్రజ్‌ రంగా, సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘రోటి కపడా రొమాన్స్‌’. విక్రమ్‌ రెడ్డి దర్శకత్వంలో వేణుగోపాల్, సృజన్‌ కుమార్‌ బొజ్జం నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ 90 శాతం పూర్తయింది. ఈ టైటిల్‌ లోగో రిలీజ్‌ చేసిన నిర్మాత ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కథ విన్నాను. కొత్త కంటెంట్‌ ఉన్న చిత్రాలను మన ఆడియన్స్‌ ఆదరిస్తారు. ఈ చిత్రం కూడా ఇదే కోవలో ఉంటుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘పక్కా యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఫిల్మ్‌ ఇది’’ అన్నారు వేణుగోపాల్, విక్రమ్‌.

Advertisement
Advertisement