డిసెంబరులో చాంపియన్ | Roshan Champion Worldwide Release On December 25th | Sakshi
Sakshi News home page

డిసెంబరులో చాంపియన్

Oct 7 2025 3:58 AM | Updated on Oct 7 2025 3:58 AM

Roshan Champion Worldwide Release On December 25th

క్రిస్మస్‌ పండక్కి థియేటర్స్‌లోకి వస్తున్నాడు చాంపియన్. నటుడు శ్రీకాంత్‌ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్‌ స్పోర్ట్స్‌ డ్రామా ‘చాంపియన్’. ప్రదీప్‌ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనశ్వర రాజన్‌ హీరోయిన్. జీ స్టూడియోస్‌ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్, కాన్సెప్ట్‌ ఫిల్మ్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.

మరోవైపుపోస్ట్‌ ప్రోడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కాగా, ‘చాంపియన్’ని డిసెంబరు 25న రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించి, రోషన్ కొత్తపోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ‘‘ఇప్పటి వరకు చేయని ఓ విభిన్నమైన  పాత్రలో కనిపించబోతున్నారు రోషన్‌. ఈ  పాత్ర కోసం  ఫిజికల్‌గానూ ట్రాన్్సఫర్మేషన్ అయ్యారు’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: మిక్కీ జె. మేయర్, కెమెరా: ఆర్‌. మధి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement