రొమాంటిక్ లవ్ స్టొరీగా రాబోతున్న 'మది' | Sakshi
Sakshi News home page

ఈ తరం యువత ఆలోచనా విధానానికి అద్దం పట్టేలా 'మది'

Published Sat, Oct 1 2022 9:24 PM

Romantic Love Story Madhi Movie Ready To Release - Sakshi

శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నటించిన చిత్రం 'మది'. ఈ చిత్రానికి నాగ ధనుష్ దర్శకత్వం వహించగా.. పీవీఆర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ప్రగతి పిక్చర్స్ బ్యానర్‌పై రామ్ కిషన్  నిర్మిస్తున్న సినిమా. ఆర్వీ సినిమాస్ సహనిర్మాతలుగా, ఆర్వీ రెడ్డి సమర్పణలో ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులని అలరించబోతుంది. 

రొమాంటిక్ లవ్ స్టొరీగా రాబోతున్న 'మది'. ఈ తరం యువత ఆలోచనా విధానానికి అద్దం పట్టేలా వినూత్నరీతిలో కథనం సాగుతుంది. ఈ సినిమాలో  ఐదు సాంగ్స్ ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించనుందని నిర్మాత రామ్ కిషన్, సహా నిర్మాత శ్రీనివాస్ రామిరెడ్డి  తెలిపారు. ఈ చిత్రంలో రామ్ కిషన్, శ్రీకాంత్ బైరోజ్, స్నేహ మాధురి శర్మ, యోగి కత్రి, శ్రీనివాస్ ప్రధాన పాత్రలు పోషించారు. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement