Rashmika Mandanna-Rishab Shetty: రష్మికకు గట్టి కౌంటర్‌ ఇచ్చిన రిషబ్‌ శెట్టి, ట్వీట్‌ వైరల్‌

Rishab Shetty Tweet 6 Years of Kirik Party And Avoid Rashmika Mandanna - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నా, కాంతార హీరో రిషబ్‌ శెట్టి మధ్య కొద్ది రోజులుగా కొల్డ్‌ వార్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఇద్దరు ఒకరిపై ఒకరు పరోక్షంగా కౌంటర్‌ వేసుకున్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఇద్దరి మధ్య ఎలాంటి మన్పర్థలు లేవని, సత్సంబంధాలే ఉన్నాయని రష్మిక ఇటివల చెప్పింది. కానీ, తాజాగా రిషబ్ శెట్టి రష్మికకు ఇన్‌డైరెక్ట్‌ కౌంటర్ ఇస్తూ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. కాగా రష్మిక కన్నడ మూవీ కిరిక్‌ పార్టీ మూవీతో సినీరంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. 

2016లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. రిషబ్‌ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీతోనే రష్మిక హీరోయిన్‌గా పరిచయమైంది. తాజాగా శుక్రవారంతో (డిసెంబర్‌ 30) ఈ సినిమా విడుదలైన ఆరేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రిషబ్‌ శెట్టి ట్వీట్‌ చేస్తూ.. ‘మా సినిమా విడుదలై ఆరేళ్లు అయినప్పటికీ.. మా కోసం మీరు చేసిన సందడి, థియేటర్లో మీరు వేసిన విజిల్స్‌ అన్ని మా చెవుల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి. మమ్మల్ని మరోసారి ఆ రోజుల్లోకి తీసుకువెళ్లున్నాయి. ఈ సెలబ్రేషన్స్‌లో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని రాసుకొచ్చాడు.

అలాగే తన ట్వీట్‌కి హీరో రక్షిత్‌ శెట్టి, నిర్మాణ సంస్థ పేరు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ లోక్‌నాథ్‌ను ట్యాగ్‌ చేశాడు. అయితే ఇందులో హీరోయిన్‌గా లీడ్‌ రోల్‌ పోషించిన రష్మిక పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. అంతేకాదు ఆమె పేరు కూడా ట్యాగ్‌ చేయలేదు. దీంతో ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. దీంతో ఇది కాస్తా ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌ నిలిచింది. అయితే ‘గతంలో రష్మిక తనకు ఆఫర్‌ ఇచ్చిన నిర్మాణ సంస్థ, డైరెక్టర్‌ పేరు చెప్పకుండ సోకాల్డ్‌ ప్రొడక్షన్‌ అని చెప్పి అవమానపరించింది.. ఇప్పుడు రిషబ్‌ శెట్టి మూవీలో భాగమైన రష్మిక పేరు ప్రస్తావించకుండా ఆమెకు గట్టి కౌంటర్‌ ఇచ్చాడు’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తు‍న్నారు. 

చదవండి: 
మహేశ్‌-మహేశ్‌ మూవీ నుంచి బిగ్‌ అప్‌డేట్‌ బయటపెట్టిన రచయిత
సినీ పరిశ్రమలో విషాదం.. నిద్రలోనే కన్నుమూసిన ప్రముఖ నటుడు

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top