యూట్యూబ్‌లో అదరగొడుతున్న ‘రింగుడు రింగుడు’ పాట | Rayavalasa Movie Ringu‍du Ringudu Song | Sakshi
Sakshi News home page

యూట్యూబ్‌లో అదరగొడుతున్న ‘రింగుడు రింగుడు’ పాట

Oct 14 2026 9:40 PM | Updated on Oct 14 2026 9:40 PM

Rayavalasa Movie Ringu‍du Ringudu Song

గోపీ కృష్ణ.జె నిర్మాతగా.. ఎన్నారై రాధిక జయంతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాయవలస’. కార్తీక్ జయంతి, శ్రీషా నులు ప్రధాన పాత్రలు చేశారు. అమెరికా నుంచి కార్తీక్ జయంతి.. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. రీసెంట్‌గా విడుదల చేసిన ‘రింగుడు రింగుడు’ సాంగ్ యూట్యూబ్‌లో అదరగొడుతోంది.

గ్రామీణ జీవితం, వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ‘రాయవలస’ రూపొందించారు. నటీనటులు, సాంకేతిక బృందం అంకితభావంతో ఈ చిత్రాన్ని ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేశారు. అర్జున్ బాల మ్యూజిక్ డైరెక్టర్‌ కాగా పూర్ణాచారి, కార్తీక్ జయంతి, తరుణ్ సైదుల్ పాటలకు సాహిత్యం అందించారు. సినిమా కి సంబంధించిన రిలీజ్ డేట్ పై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్న చిత్ర బృందం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement