ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ | Sakshi
Sakshi News home page

ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ

Published Fri, Dec 29 2023 12:16 AM

Ravi Teja Gets Into Action For Mr Bachchan - Sakshi

ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీసర్‌ బచ్చన్‌గా బాధ్యతలు తీసుకున్నారు రవితేజ. ‘మిరపకాయ్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో రవితేజ, దర్శకుడు హరీష్‌శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. ‘నామ్‌ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక.

ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. పనోరమా స్టూడియోస్, టీ సిరీస్‌ల సమర్పణలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీసర్‌ బచ్చన్‌ పాత్రలో రవితేజ నటిస్తున్నారని సమాచారం. కాగా ఈ చిత్ర రెగ్యులర్‌ షూటింగ్‌ను గురువారం ప్రారంభించినట్లుగా చిత్ర యూనిట్‌ వెల్లడించింది.

Advertisement
Advertisement