సెప్టెంబరులో స్టార్ట్‌? | Sakshi
Sakshi News home page

సెప్టెంబరులో స్టార్ట్‌?

Published Mon, Aug 14 2023 12:31 AM

Ravi Teja , Director Gopichand Malineni Next Movie Shooting Starts On September 2023 - Sakshi

‘డాన్‌శీను’, ‘బలుపు’, ‘క్రాక్‌’ చిత్రాల తర్వాత హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో మరో కొత్త సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను సెప్టెంబరులో స్టార్ట్‌ చేసేలా చిత్రయూనిట్‌ సన్నాహాలు చేస్తోందనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

ఈ చిత్రంలో హీరోయిన్స్‌ పాత్రల కోసం మృణాల్‌ ఠాకూర్, పూజాహెగ్డే వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. మరి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఫైనల్‌గా ఫిక్స్‌ అవుతారా? లేకుంటే వేరే హీరోయిన్‌ ఈ ప్రాజెక్టులో యాడ్‌ అవుతారా? అన్నది తెలియాలి. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు రవితేజ ప్రస్తుతం ‘టైగర్‌ నాగేశ్వరరావు’, ‘ఈగిల్‌’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రం అక్టోబరు 20న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement