Ravi Kishan : 'రేసుగుర్రం' విలన్‌ రవికిషన్‌ ఇంట విషాదం

Ravi Kishan Pens Emotioanal Tribute After His Brother Passes Away - Sakshi

ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రామ్‌ కిషన్‌ శుక్లా గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని స్వయంగా రవికిషన్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ముంబైలోని నానావతి ఆసుపత్రిలో ఆయన కన్నుమూసినట్లు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన ట్వీట్‌ చేశారు.

కాగా రామ్‌ కిషన్‌ శుక్లా ముంబైలో ఉంటూ ప్రొడక్షన్‌ పనులు చూసుకుంటేవారు. నిన్న(ఆదివారం)రామ్‌ కిషన్‌ శుక్లా తీవ్ర అస్వస్థతకు గురికాగా ఆసుపత్రిలో చేర్చించారు. చికిత్స పొందుతూనే ఆయన కన్నుమూశారు. ఇదిలా ఉంటే రవికిషన్‌ అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన రేసుగుర్రం చిత్రంలో ‘మద్దాలి శివారెడ్డి’పాత్రతో తెలుగు వారికి దగ్గరైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన గోరఖ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top