Rashmika Mandanna: స్పెషల్‌ సాంగ్‌కు షాకింగ్‌ రెమ్యునరేషన్‌ డిమాండ్‌, నిర్మాతలకు చుక్కలు

Rashmika Mandanna Demands Shocking Remuneration For Special Song - Sakshi

ప్రస్తుతం స్పెషల్‌ సాంగ్స్‌లో హీరోయిన్లు స్టెప్పులు వేయడం సాధారణ విషయమైంది. ఇప్పటికే మిల్కీ బ్యూటీ తమన్నా, కాజల్‌ అగర్వాల్‌, సమంతలు స్పెషల్‌ సాంగ్స్‌తో ఆకట్టుకున్నారు. ఇక వారి బాటలోనే నడిచేందుకు నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా సైతం సిద్ధం అంటోంది. కన్నడ బ్యూటీ అయిన రష్మీక.. గీతా గోవిందం మూవీతో టాలీవుడ్‌ స్టార్‌డమ్‌ కొట్టేసింది. ఈ నేపథ్యంలో పాన్‌ ఇండియా చిత్రం పుష్పతో జాతీయ స్తాయిలో గుర్తింపు పొందింది.

చదవండి: ఈ యంగ్‌ హీరో 50 రోజుల కష్టం, సుకుమార్‌పై అరుదైన దృశ్యం

ఈ క్రమంలో బాలీవుడ్‌లోనూ ఆఫర్స్‌ అందుకుంటూ ఇప్పటికే రెండు సినిమాలను సెట్స్‌పైకి తీసుకువచ్చింది. ఇలా సౌత్‌, నార్త్‌లో వరస ఆఫర్లతో బిజీగా ఉన్న రష్మిక.. స్పెషల్‌ సాంగ్స్‌తోనూ అలరించనుందుకు సై అంటుంది. ఈ క్రమంలో ఆమెకు బాలీవుడ్‌ హీరో రణ్‌బిర్‌ కపూర్‌, అర్జున్‌ రెడ్డి ఫేం సందీప్‌ వంగ కాంబినేషన్‌లో రూపొందనున్న యానిమల్‌ మూవీలో ఐటెం సాంగ్‌ కోసం రష్మికను సంప్రదించగా ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

చదవండి: ఇప్పటికీ సీక్రెట్‌గానే.. పునీత్‌ లేడన్న విషయం ఆమెకు చెప్పలేదట

అయితే కొన్ని చర్చల అనంతరం ఈ పాటకు రష్మికను ఫిక్స్‌ చేసిన దర్శక-నిర్మాతలు ఇదే విషయమై ఆమెను కలిశారట. అయితే దీనికి ఒకే చెప్పిన రష్మిక వారు అవాక్కాయ్యే రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసిందట. ఈ ఐటెం సాంగ్‌ కోసం ఆమె ఏకంగా రూ. 2 కోట్లు ఇవ్వాలని నిర్మాతలకు చుక్కలు చూపించిందట. సినిమా మొత్తానికి రూ. 2 కోట్లు తీసుకునే రష్మిక.. ఒక ఐటెం సాంగ్‌కు భారీగా డిమాండ్‌ చేయడం చూసి నిర్మాతలు షాకయ్యారట. చివరకు ఆమెతో పలుమార్లు చర్చలు జరిపి కోటిన్నర ఇవ్వడానికి రెడీ అయ్యారని, దీంతో రష్మిక కన్విన్స్‌ అయ్యి వారం రోజుల కాల్‌షీట్‌ కూడా ఇచ్చినట్లు బీ-టౌన్‌లో గుసగుసల వినిపిస్తున్నాయి.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top