రంగరంగ వైభవంగా టీజర్‌ వచ్చేసింది.. | Sakshi
Sakshi News home page

Ranga Ranga Vaibhavanga: రంగరంగ వైభవంగా టీజర్‌ చూశారా?

Published Mon, Jun 27 2022 12:35 PM

Ranga Ranga Vaibhavanga Teaser Out Now - Sakshi

పంజా వైష్ణవ్‌ తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'రంగరంగ వైభవంగా'. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కేతిక శర్మ వైష్ణవ్‌తో జోడీ కట్టింది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ రిలీజైంది. నన్నే చూస్తావ్‌, నా గురించే కలలు కంటావు, నన్నే ప్రేమిస్తావు, కానీ నీకు నాతో మాట్లాడటానికి ఈగో.. అంటూ హీరోయిన్‌ వాయిస్‌తో టీజర్‌ మొదలైంది. ఈ మూవీలో హీరోహీరోయిన్లు టామ్‌ అండ్‌ జెర్రీలా పోట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది.

హీరోయిన్‌తో మాట్లాడకపోయినా సరే, ఆమె ఆపదలో ఉందంటే మాత్రం ఆదుకునేందుకు క్షణాల్లో బయలుదేరతాడని కనిపిస్తోంది. మొత్తానికి టీజర్‌ మాత్రం ఇంట్రస్టింగ్‌ ఉంది. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. శామ్‌దత్‌ సైనుద్దీన్‌ సినిమాటోగ్రాఫర్‌గా పని చేయగా దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

చదవండి: ఆ సినిమాకు మొదట మిశ్రమ రివ్యూలు వచ్చాయి: హీరో
చైతూతో డేటింగ్‌పై స్పందించిన శోభిత, వీడియో వైరల్‌!

Advertisement
 
Advertisement
 
Advertisement