Ranga Ranga Vaibhavamga Review: ‘రంగరంగ వైభవంగా’ టాక్‌ ఎలా ఉందంటే..

Ranga Ranga Vaibhavamga Movie Twitter Review In Telugu - Sakshi

మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రంగరంగ వైభవంగా’.  కేతికా శర్మ హీరోయిన్‌.`అర్జున్‌ రెడ్డి`ని తమిళంలో రీమేక్‌ చేసిన దర్శకుడు గిరీశాయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.  శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు(సెప్టెంబర్‌ 2)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. , మెగా ఫ్యామిలీ హీరో నుంచి వస్తోన్న సినిమా కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Ranga Ranga Vaibhavamga Movie

ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కిన ఈ చిత్రంపై వైష్ణవ్‌ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు.  ఉప్పెన లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ప్రయోగాత్మకంగా చేసిన కొండపొలం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. దీంతో కాస్త గ్యాప్‌ తీసుకొని తనకు అచ్చొచ్చిన రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను పలకరించాడు.  

Ranga Ranga Vaibhavamga Movie Twitter Review

ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది.దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘రంగరంగ వైభవంగా’ కథేంటి? సినిమా ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు.

Ranga Ranga Vaibhavamga Movie Audience Response

నెటిజన్స్‌ నుంచి  ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వినిపిస్తోంది.  రంగరంగ వైభవంగా మంచి యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ అని కొంతమంది అంటుంటే..  రొటీన్‌ ఫ్యామిలీ డ్రామా అని మరికొంతమంది నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. 

ఫ్యామిలీ ఎపిసోడ్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయని చెబుతున్నారు.  క్లీన్‌ లవ్‌స్టోరీతో సినిమా సాగుతుందట. అయితే ఊహకందేలా సినిమా సాగడంతో ప్రేక్షకుడికి అంతగా ఆసక్తి కలించదని చెబుతున్నారు. సత్యతో కామెడీ సీన్స్‌ నవ్వులు పూయిస్తుందని అంటున్నారు. సెకండాఫ్‌తో పోలిస్తే.. ఫస్టాఫ్‌ కాస్త బెటర్‌అని అంటున్నారు. ఓవరాల్‌గా రంగరంగ వైభవంగా యావరేజ్‌ సినిమా అని చెబుతున్నారు. నెట్టింట కూడా ఈ సినిమాకు ఎక్కువగా బజ్‌ లేకపోవడం గమనార్హం. 

 ఇక వైష్ణవ్‌ తేజ్‌ మూడో చిత్రం విడుదలైన సందర్భంగా మెగా హీరోలు వరుణ్‌ తేజ్‌, సాయితేజ్‌తో పాటు పలువురు నటులు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ ట్వీట్స్‌ చేస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top