త్వరలోనే సీజన్‌-3 ప్రారంభం

Rana Daggubati Shoots for No. 1 Yaari With Rana season 3 Teaser - Sakshi

టాలీవుడ్‌ నటుడు రానా దగ్గుబాటి మరోసారి మరోసారి బుల్లితెర మీద హోస్ట్‌గా అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ‘నెం 1 యారి’ అనే టాక్‌ షోకు రెండు సీజన్లకు గానూ.. రానా హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పడు మూడో సీజన్‌తో మరోసారి అలరించడానికి  సిద్ధమయ్యాడు. ఇప్పటికే రామా నాయుడు స్టూడియోలో దీనికి సంబంధించిన టీజర్‌ షూట్‌ను కూడా చిత్రీకరించినట్లు సమాచారం. అయితే 2020 మార్చిలోనే సీజన్‌-3  ప్రారంభం కావాల్సి ఉండగా, కరోనా కారణంగా బ్రేక్‌ పడింది. ఆ తర్వాత రానా వివాహం, విరాట పర్వం షూటింగ్‌ ఉండటంతో మరికొంత కాలం ఈ షోను వాయిదా వేస్తూ వచ్చారు.


ఇక ఈ మధ్యే టీజర్‌ను చిత్రీకరించడంతో అతి త్వరలోనే నెం 1 యారి మూడో సీజన్‌ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం​. గత రెండు సీజన్లు రేటింగ్‌ పరంగా దూసుకుపోవడంలో రానా సక్సెస్‌ అయ్యారు. తన హోస్టింగ్‌తో హుషారెత్తించారు. త్వరలోనే బుల్లితెరపై నెం 1 యారి సీజన్‌-3 ప్రారంభం కానుండగా, ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా మీలో ఎవరు కోటీశ్వరుడు షో కూడా ప్రసారం కానుంది. ఈ రెండు షోలు జెమిని ఛానల్‌లోనే టెలికాస్ట్‌ కానున్నాయి. ఇది ఫ్యాన్స్‌కు పండుగ లాంటిదే. ఒకేసారి ఇద్దరు స్టార్‌ హీరోలు బుల్లితెరపై సందడి చేయనుండటంతో ఎంటర్‌టైన్మెంట్‌ డోస్‌ కూడా డబల్‌ కానుంది. 

చదవండి :  (త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో ఎన్టీఆర్; మొత్తం 60 ఎపిసోడ్‌లు!)
(ఆస్కార్ బరిలో సూర్య సినిమా.. భారత్‌ నుంచి ఆ ఒక్కటే)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top