విజిల్‌ వేయించేలా 'ది వారియర్‌' విజిల్ సాంగ్.. | Sakshi
Sakshi News home page

The Warrior Movie: సూర్య వేసిన రామ్‌ పోతినేని 'విజిల్' సాంగ్‌ విన్నారా ?

Published Wed, Jun 22 2022 9:22 PM

Ram Pothineni The Warrior Whistle Lyrical Song Released By Surya - Sakshi

Ram Pothineni The Warrior Whistle Lyrical Song Released By Surya: ఎనర్జిటిక్ హీరో రామ్‌ పోతినేని హీరోగా తమిళ డైరెక్టర్‌ లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ది వారియర్‌’. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతీశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షర గౌడ్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 14న రిలీజ్‌ కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్‌, పోస్టర్స్‌ ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందులోను 'బుల్లెటు' సాంగ్‌కు విపరీతమైన ఆదరణ లభించింది. తాజాగా మరో లిరికల్‌ సాంగ్‌ను బయటకు వదిలింది చిత్రబృందం. 

ఈ సినిమాలోని 'విజిల్‌.. విజిల్‌..' అంటూ  సాగే పాటను సోషల్‌ మీడియా వేదికగా స్టార్‌ హీరో సూర్య రిలీజ్ ‍చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ మరోసారి తన మార్క్‌తో అందరి చేత విజిల్‌ వేయించేలా మ్యూజిక్ అందించాడు. సాహితీ రాసిన క్యాచీ లిరిక్స్‌, సింగర్స్‌ ఆంటోని దాసన్, శ్రీనిషా జయశీలన్ అద్భుతంగా ఆలపించారు. ఇక కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్ నేతృత్వంలో రామ్‌, కృతిశెట్టి వేసిన స్టెప్స్ పాటకు హైలెట్‌గా నిలవనున్నాయి. విడుదలైన అతి కొద్ది సమయంలోనే ఈ పాటకు విశేష ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ఈ సాంగ్ ఎలాంటి రికార్డ్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి. 

చదవండి: 'పుష్ప 2'లో శ్రీవల్లి చనిపోతుందా ? నిర్మాత క్లారిటీ !
కమెడియన్‌ లైంగిక వేధింపులు.. 50 ఏళ్ల తర్వాత తీర్పు..


Advertisement
 
Advertisement
 
Advertisement