పదకొండు భాషల్లో థ్రిల్లర్‌

Ram Gopal Varma releasing hisfilm Thriller on his OTT platform RGV World - Sakshi

థియేటర్స్‌ లేకపోవడంతో సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తున్నారు.  సంచలనాత్మక దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మాత్రం ఓటీటీల కోసమే సినిమాలు తయారు చేస్తున్నారు. లాక్‌ డౌన్‌ సమయం నుంచి పలు సినిమాలను ‘పే అండ్‌ వ్యూ’ (ఆన్‌లైన్‌లో  డబ్బు చెల్లించి సినిమా చూసే విధానం) పద్ధతిలో విడుదల చేస్తున్నారు. తాజాగా ‘థ్రిల్లర్‌’ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. అప్సరా రాణి, రాకీ కచ్చి జంటగా నటించిన ఈ సినిమా ఆర్జీవీ వరల్డ్, శ్రేయాస్‌ ఈటీ ద్వారా ఆగస్ట్‌ 14 రాత్రి 9 గంటలకు విడుదల కానుంది. 200 రూపాయిలు చెల్లించి ఈ సినిమాను చూడొచ్చు. 11 భాషల్లో (తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, భోజ్‌ పురి, గుజరాతి, ఒడియా  తదితర భాషలు) ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సందర్భంగా రామ్‌ గోపాల్‌ వర్మ మాట్లాడుతూ –‘ఒక ఇంట్లోనే జరిగే కథతో తీసిన సినిమా ‘థ్రిల్లర్‌’. ఎరోటిక్‌ జానర్‌ లో కొన్ని చిత్రాలు చేయాలని ప్లాన్‌ చేశాను. అందులో ఒకటి  ఈ ‘థ్రిల్లర్‌’ చిత్రం. ఒక రాత్రి ఓ పెద్ద బంగ్లాలో ఓ అమ్మాయికి ఎదురయ్యే సంఘటనలే ఈ చిత్ర కథాంశం. నేను అనుకున్న పాత్రకు అప్సరా రాణి చక్కగా సరిపోయింది’’ అన్నారు. అలాగే వర్మ నుంచి ‘డేంజరస్లీ క్రై ం’, అర్నబ్, అల్లు’ అనే చిత్రాలు రానున్నాయి. ‘‘పవర్‌ స్టార్, అల్లు, అర్నబ్‌’ చిత్రాలు ఆయా వ్యక్తులను  ప్రొవోక్‌ (రెచ్చగొట్టే విధంగా) చేయడానికేనా’’ అని అడిగితే ‘కచ్చితంగా అందుకే’ అన్నారు వర్మ.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top