సైరాకుఏడాది పూర్తి, రామ్‌చరణ్‌ ట్వీట్‌

Ram Charan Twitted On The First Anniversary of Saira Narasimha Reddy  - Sakshi

బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ సైరా నరసింహారెడ్డి చిత్రం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రామ్‌ చరణ్‌ ట్విటర్‌ వేదికగా ‍స్పందించారు. సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి గా కృతజ్ఙతలు తెలిపారు. ‘బెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌, బెస్ట్‌ క్రూ, ఏ బ్రిలియంట్‌ టీం, థ్యాంక్యూ వన్‌ అండ్‌ ఆల్‌’ అని రామ్‌చరణ్‌ ట్వీట్‌ చేశారు. ఈ సినిమాను రామ్‌చరణ్‌ ప్రొడ్యూస్‌ చేశారు.

Best EXPERIENCE !!
Best CAST!! &
A BRILLIANT team!!
A year since #SyeRaa released.
Thank you one and all.@SrBachchan @KChiruTweets @DirSurender #Nayanthara @KicchaSudeep @VijaySethuOffl @IamJagguBhai @ravikishann @tamannaahspeaks @KonidelaPro #MahatmaGandhi pic.twitter.com/dQJcR5rVRA

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా నరసింహారెడ్డి తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా, తమన్నా, నయనతార హీరోయిన్లుగా నటించారు. ఇక బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్ర పోషించారు. సురేందర్‌ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మొదటి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా సురేందర్‌ రెడ్డి కూడా తనని నమ్మి సినిమా చేసిన చిరంజీవికి, రామ్‌చరణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: ఆ సినిమా కోసమే ఆ లుక్‌!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top