నాని నీకు హ్యాట్సాఫ్.. 'హిట్ 3'పై రామ్ చరణ్ ట్వీట్ | Ram Charan Tweet For Hit 3 Movie Response | Sakshi
Sakshi News home page

Hit 3 Ram Charan: నానికి చరణ్ ఎలివేషన్.. ట్వీట్ వైరల్

May 3 2025 7:29 PM | Updated on May 3 2025 7:39 PM

Ram Charan Tweet For Hit 3 Movie Response

నాని లేటెస్ట్ మూవీ హిట్ 3.. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. మరీ సూపర్ అని అనట్లేదు గానీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్స్ కూడా రెండు రోజుల్లో రూ.62 కోట్లకు పైనే వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మెగా హీరో రామ్ చరణ్.. ఈ సినిమా గురించి ట‍్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. హీరో నానికి హ్యాట్సాఫ్ కూడా చెప్పాడు. 

'హిట్ 3కి అద్భుతమైన రివ్యూలు వచ్చాయని తెలిసింది. మై డియర్ బ్రదర్ నాని.. యూనిక్ స్క్రిప్ట్స్  ఎంపిక చేసి, హిట్స్ కొడుతున్నందుకు నీకు హ్యాట్సాఫ్. ఈ సినిమా తీసిన శైలేష్ కొలనుకి కూడా హ్యాట్సాఫ్. శ్రీనిధి శెట్టి, ప్రశాంతి త్రిపర్నేని, వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ సినిమా టీమ్ కు శుభాకాంక్షలు' అని చరణ్ రాసుకొచ్చాడు.

(ఇదీ చదవండి: టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా 'టూరిస్ట్ ఫ్యామిలీ' 

అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడీ స్థాయికి చేరిన నాని.. త్వరలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా ఓ సినిమాని నిర్మించబోతున్నాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్.. నాని కోసం, హిట్ 3 కోసం ట్వీట్ పెట్టినట్లు తెలుస్తోంది. 

అలానే వచ్చే ఏడాది మార్చి 26న నాని 'ద ప్యారడైజ్', మార్చి 27న చరణ్ 'పెద్ది' సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయని అధికారికంగానే ప్రకటించారు. ఇప్పుడు హిట్ 3 కోసం చరణ్ ట్వీట్ పెట్టడం చూస్తుంటే చరణ్ కి పోటీగా వస్తాడా? తప్పుకొంటాడా అనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

(ఇదీ చదవండి: కొత్త రికార్డ్.. మహేశ్ బాబు తర్వాత నానినే 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement