
రామ్‌చరణ్ (Ram Charan) పూర్తిస్థాయి హీరోగా నటించిన చివరి చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ (RRR Movie). ఈ పాన్ ఇండియా మూవీ తర్వాత ఆచార్యలో కీలక పాత్ర పోషించాడు. ఆ మరుసటి ఏడాది కిసీకా భాయ్ కిసీకా జాన్ చిత్రంలో ఓ పాటలో కనిపించాడు. జక్కన్న జీవితంపై తెరకెక్కిన మోడ్రన్ మోస్టర్స్: ఎస్ ఎస్ రాజమౌళి అనే డాక్యుమెంటరీ మూవీలోనూ కనిపించాడు.
ట్రైలర్ ఎక్కడ?
ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ(Game Changer) చేస్తున్నాడు. దాదాపు మూడేళ్ల తర్వాత హీరోగా అతడు వెండితెరపై ప్రేక్షకులను పలకరించనున్నాడు. సుమారు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అమెరికాలో ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గరపడుతున్నా ఇంతవరకు ట్రైలర్ విడుదల చేయలేదు.

అభిమానుల ఎమోషన్స్ పట్టించుకోవట్లేదు
దీంతో ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చాడు. 'నా పేరు ఈశ్వర్, నేను చరణ్ అన్న అభిమానిని. సినిమాకు ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలుంది. ఇప్పటివరకు ట్రైలర్ అప్‌డేట్ కూడా ఇవ్వలేదు. అభిమానుల ఎమోషన్స్‌ను పట్టించుకోవట్లేదు. ఈ నెలాఖరుకల్లా మీరు ట్రైలర్ అప్‌డేట్ ఇవ్వకపోయినా.. కొత్త సంవత్సరం సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేయకపోయినా నేను ఆత్మహత్య చేసుకుంటాను' అని ఓ లేఖ షేర్ చేశాడు.
పిచ్చి ఆలోచనలు మానేయ్
బతికుంటే అందరితో సినిమా చూస్తానని, చనిపోతే ఆత్మలా చూస్తానని.. తన జీవితం గేమ్ ఛేంజర్ టీమ్ చేతుల్లో ఉందన్నాడు. ఇది చూసిన నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. ట్రైలర్ కోసం చనిపోవడమేంటి? ఇలాంటి వెర్రి ఆలోచనలు మానేయమని కొందరు.. ఇప్పటికే ఇండస్ట్రీలో పెద్ద గోల నడుస్తోంది, నువ్వు లేని పెంట పెట్టకు అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
బ్రతికుంటే అందరితో చూస్తా...
చస్తే ఆత్మ లా చూస్తా...
ఇదంతా నీ చేతుల్లోనే ఉంది @GameChangerOffl 😭🙏
జై చరణ్ జై చరణ్ #RamCharan #GlobalStarRamCharan #GameChanger pic.twitter.com/ePfifI2g8g— EshwaRC15 Raj(Dhfc) 🚁🚁 (@EshwarDhfc) December 27, 2024
చదవండి: OTT: జీవితం అర్థం చెప్పే ప్రేమకథ