
Ram Charan Wraps Up RC15 Amritsar Shooting Schedule: ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో రామ్‌చరణ్ రేంజ్ పెరిగిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో అతడి యాక్టింగ్‌కు బి-టౌన్ ఫిదా అయ్యింది. దీంతో చరణ్ నేషనల్ స్టార్‌గా మారిపోయాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం చెర్రీ శంకర్ దర్శకత్వంలో RC15 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు అతడు నటించిన ఆచార్య రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే ఆర్‌సీ15 సినిమాషూటింగ్ కొద్ది రోజులుగా పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో జరుగుతుంది. అయితే తాజాగా ఈ మూవీ అక్కడి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చరణ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
చదవండి: హీరోయిన్ శ్రియ బేబీబంప్ డాన్స్ వీడియో చూశారా?
స్పెషల్ ప్లైట్‌లో అమృత్‌సర్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న చరణ్ తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. ఈ సందర్భంగా చరణ్ ‘శంకర్‌గారి(RC15 సినిమా షూటింగ్) అమృత్‌సర్ షెడ్యుల్ పూర్తి. బ్యాక్ టూ ఆచార్య ప్రమోషన్స్’ అని పేర్కొన్నాడు. దీంతో త్వరలోనే ఆచార్య టీం ప్రమోషన్స్‌తో బిజీ కానుందని తెలుస్తోంది. చరణ్ పోస్ట్ చూసిన మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. కాగా RC15లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, సునీల్, అంజలి ప్రధాన పాత్రలు పోషించనున్నారు. అయితే అమృత్‌సర్ షెడ్యూల్ నేపథ్యంలో చరణ్ మంగళవారం షూటింగ్ గ్యాప్‌లో కొంత సమయాన్ని అక్కడి బీఎస్‌ఎఫ్ జవాన్లతో గడిపిన సంగతి తెలిసిందే. వారితో కలిసి కాసేపు ముచ్చటించి, జావాన్లతో భోజనం చేసిన ఫోటోలను చరణ్ ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు.
చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌లో ఎన్టీఆర్ ఎలివేషన్ సీన్‌ను డిలీట్ చేశారు: బయటపెట్టిన నటుడు