కాంబినేషన్‌ సెట్‌? | Rajinikanth Next Movie With Director cibi chakravarthi | Sakshi
Sakshi News home page

కాంబినేషన్‌ సెట్‌?

Published Sun, Aug 28 2022 5:21 AM | Last Updated on Sun, Aug 28 2022 5:21 AM

Rajinikanth Next Movie With Director cibi chakravarthi - Sakshi

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ జోరు పెంచారు. ఓ సినిమా చేస్తుండగానే తర్వాతి చిత్రాన్ని కూడా లైన్‌లో పెట్టేస్తున్నారాయన. ప్రస్తుతం నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో ‘జైలర్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు రజనీకాంత్‌. ఈ మూవీ షూటింగ్‌ ఇటీవలే చెన్నైలో ప్రారంభమైంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం రిలీజ్‌ కానుందట. అయితే ‘జైలర్‌’ తర్వాత రజనీ నటించనున్న చిత్రానికి సిబి చక్రవర్తి దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో సాగుతోంది.

కామెడీతో కూడిన ఓ కమర్షియల్‌ లైన్‌ను రజనీకాంత్‌కు చక్రవర్తి చెప్పారంటూ గతంలోనే వార్తలు వచ్చాయి. రీసెంట్‌గా మరోసారి రజనీని కలిసిన ఆయన కథ చెప్పారట. ఈ కథ పట్ల రజనీ పాజిటివ్‌గా ఉండటంతో ఫైనల్‌ స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో ఉన్నారట చక్రవర్తి. ఈ కొత్త కాంబినేషన్‌ గురించి త్వరలోనే ప్రకటన రానున్నదని భోగట్టా. కాగా  శివకార్తికేయన్‌ హీరోగా సిబి చక్రవర్తి దర్శకత్వం వహించిన ‘డాన్‌’(తమిళ్‌) చిత్రం మంచి హిట్‌ అయింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement