ఆగస్ట్‌లో ఫిక్స్‌ | Sakshi
Sakshi News home page

ఆగస్ట్‌లో ఫిక్స్‌

Published Fri, May 5 2023 4:12 AM

Rajinikanth-Nelson dilipkumar Jailer gets release date fix - Sakshi

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘జైలర్‌’. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కు సంబంధించిన ఓ అప్‌డేట్‌ను గురువారం చిత్ర యూనిట్‌ ఇచ్చింది. ఆగస్ట్‌ 10న ‘జైలర్‌’ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, ఓ వీడియోను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

వీడియోలో కారులో నుంచి స్టైల్‌గా దిగుతున్న రజనీకాంత్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది.కళానిధి మారన్‌ సమర్పణలో సన్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రెగ్యులర్‌ కమర్షియల్‌ ఫార్మాట్‌కు పూర్తి భిన్నంగా థ్రిల్లర్‌ తరహాలో ఈ సినిమా తెరకెక్కుతోందని కోలీవుడ్‌ టాక్‌. శివరాజ్‌కుమార్, మోహన్‌ లాల్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, ప్రియాంక అరుల్‌ మోహన్, మిర్నా మీనన్‌ తదితరులు ముఖ్య ΄ాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌.

Advertisement
 
Advertisement
 
Advertisement