నిర్మల్‌ బొమ్మ నేపథ్యంలో... | radhakrishna movie first look release | Sakshi
Sakshi News home page

నిర్మల్‌ బొమ్మ నేపథ్యంలో...

Aug 6 2020 6:14 AM | Updated on Aug 6 2020 6:14 AM

radhakrishna movie first look release - Sakshi

‘‘ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నిర్మల్‌ బొమ్మ కాలక్రమేణా ప్లాస్టిక్‌ బొమ్మల తాకిడికి కుదుపులకు లోనయ్యింది. ఈ నేపథ్యంలో ఒక గొప్ప సందేశాత్మక ప్రేమకథగా మా ‘రాధాకృష్ణ’ చిత్రం తెరకెక్కించాం’’ అని చిత్ర నిర్మాణసారథి పుప్పాల కృష్ణ కుమార్‌ అన్నారు. ప్రముఖ దర్శకులు శ్రీనివాసరెడ్డి సమర్పణ, స్క్రీ¯Œ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం ‘రాధాకృష్ణ’. అనురాగ్, ముస్కాన్‌ సేథీ జంటగా టి.డి. ప్రసాద్‌ వర్మ దర్శకత్వంలో రూపొందింది. హారిణి ఆరాధన క్రియేష¯Œ ్స, శ్రీ నవహాస్‌ క్రియేషన్స్‌ పతాకాలపై పుప్పాల సాగరిక  నిర్మించారు.

పుప్పాల కృష్ణకుమార్‌ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణ కుమార్‌ మాట్లాడుతూ– ‘‘తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే ఎన్నో గొప్ప విశేషాల్లో నిర్మల్‌ బొమ్మ ప్రత్యేకమైనది. ఆదిలాబాద్‌ ఆటవీ ప్రాంతంలో లభించే పొనికి చెక్కతో ప్రాణం పోసుకునే నిర్మల్‌ బొమ్మ తయారీ పరిశ్రమపై ఆధారపడిన ఎంతో మంది కళాకారుల నం ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉంది. ఈ నేపథ్యంలో మా సినిమా రూపొందింది. మా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, కెమెరా: సురేందర్‌ రెడ్డి.

Advertisement
 
Advertisement
Advertisement