రాజ్ కందకూరి చేతుల మీదుగా ‘రాధా మాధవం’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్‌ | Sakshi
Sakshi News home page

నిర్మాత రాజ్ కందకూరి చేతుల మీదుగా ‘రాధా మాధవం’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Published Wed, Nov 15 2023 1:43 PM

Radha Madhavam Movie First Look Poster Launch - Sakshi

విలేజ్ లవ్ డ్రామాలకు సిల్వర్ స్క్రీన్ మీద ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. తాజాగా మరో గ్రామీణ ప్రేమ కథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనల్ వెంకటేష్ నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహిస్తున్నారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ క్రమంలో మూవీ ఫస్ట్ లుక్‌ను నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రిలీజ్ చేయించింది.

ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన అనంతరం రాజ్ కందకూరి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. గోనాల్ వెంకటేష్ నిర్మించారు. వినాయక్‌కు లీడ్‌గా ఇది రెండో చిత్రం. పోస్టర్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తారు. పోస్టర్ మాత్రం నాకు చాలా నచ్చింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తార’ని నమ్ముతున్నాను.' అని అన్నారు. 

హీరో వినాయక్ మాట్లాడుతూ.. ‘మా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన రాజ్ కందుకూరి గారికి థాంక్స్. వారి సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదించాలి. అందరూ మా సినిమాను చూడండి.’ అని అన్నారు. నిర్మాత వెంకటేష్ మాట్లాడుతూ.. ‘రాధా మాధవం పోస్టర్ లాంచ్ చేసిన రాజ్ కందుకూరికి థాంక్స్. మా టీం ఎంతో సహకరించారు’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement