Pushpa 2: The Rule Powerful Dialogue Leaked In Social Media - Sakshi
Sakshi News home page

Pushpa 2: The Rule: సోషల్‌ మీడియాను ఊపేస్తోన్న పుష్ప 2 పవర్‌ఫుల్‌ డైలాగ్‌

Dec 11 2022 5:36 PM | Updated on Dec 11 2022 6:00 PM

Pushpa 2: The Rule Powerful Dialogue Leaked In Social Media - Sakshi

అడవిలోని జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం.. అదే పులి

పుష్ప సినిమాలో తగ్గేదేలే డైలాగ్‌ ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పుష్ప పాన్‌ ఇండియా లెవల్‌లో హిట్‌ అయ్యాక ఎవరి నోట చూసినా ఇదే డైలాగ్‌ వినిపించేది. దీని సీక్వెల్‌ అయిన పుష్ప: ది రూల్‌ మూవీలో దీన్ని మించి అనేట్లుగా అస్సలు తగ్గేదేలే అనే డైలాగ్‌ వాడుతున్నట్లు ఇటీవలే అల్లు అర్జున్‌ వెల్లడించాడు. ఇకపోతే ఈ సినిమాలోని ఓ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ నెట్టింట లీక్‌ అయినట్లు తెలుస్తోంది. అడవిలోని జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం.. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్పరాజ్‌ వచ్చాడని అర్థం.. ఈ డైలాగ్‌ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. డైలాగ్‌ అదిరిపోయిందంటూ పుష్ప ది రూల్‌ (#PushpaTheRule) హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతోంది.

ఇకపోతే క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప మొదటి భాగం ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో తెలిసిందే! తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజైన ఈ సినిమా పాన్‌ ఇండియా రేంజ్లో విజయం సాధించింది. దేశవ్యాప్తంగా దాదాపు రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టింది పుష్ప. ఒక్క హిందీలోనే వంద కోట్లు కొల్లగొట్టడం విశేషం. ఇటీవలే పుష్ప రష్యాలోనూ విడుదలైంది. ఈ క్రమంలోనే సుకుమార్‌, బన్నీ, రష్మిక మందన్నా రష్యా రాజధాని మాస్కోలో పర్యటించి ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. తొలి పార్ట్‌ను మించిపోయేలా పుష్ప 2ను తెరకెక్కించే పనిలో పడ్డారు మేకర్స్‌.

చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న కోడ్‌ నేమ్‌ తిరంగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement